ఇక నుండి అలాంటి సినిమాలు చేయను

త్వరలో విడుదల సన్నద్దమవుతున్న సాహో' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్, శ్రద్ద సినిమా ప్రమోషన్స్‌తో బిజీబిజీగా గడిపేస్తున్నారు. అయితే తాజాగా ఓ ప్రచార వేడుకలో పాల్గొన్న ప్రభాస్ సంచలన ప్రకటన చేశాడు. ఇకపై భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించానని తెలిపాడు.భారీ బడ్జెట్ చిత్రాల వల్ల ఎక్కువ సమయం షూటింగ్ లోనే గడపాల్సి వస్తుందని, దీంతో తనపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఇప్పటి నుంచి ఏటా రెండు సినిమాలు చేసి అభిమానుల కోరిక తీరుస్తానని స్పష్టం చేశారు.
ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు కలిసి నిర్మించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com