ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రవితేజ!

కామెడీ క్యారెక్టర్స్‌తో మెుదలై అగ్ర హీరో స్థాయికి ఎదిగిన అతి తక్కువ మందిలో రవితేజ ఒకరు. హాస్యం.. హీరోయిజం కలగలిపి నవ్వులు పడించే నటన అతని సొంతం. ఇటీవల తను నటించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించకపోయినప్పటికీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రవితేజ డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ దర్శకుడు ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా రవితేజకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో రవితేజ గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు.కొత్త సినిమాలోని పాత్ర కోసం ఇలా గెటప్ మార్చారని నెటిజన్స్ అనుకుంటున్నారు. కానీ అదేం కాదు ఇదంతా ఫేస్‌యాప్ మాయ. ఎవరూ గుర్తుపట్టలేనంతగా రవితేజ స్లిమ్‌గా, యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. దీంతో ఈ ఫొటో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో పాత రవితేజలా కనిపిస్తున్న మాస్ మహరాజాను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com