తాజా వార్తలు

11 ఏళ్ల చిన్నోడితో ప్రేమా పెళ్లి.. అయితే ఏంటి.. నటి ఫైర్

11 ఏళ్ల చిన్నోడితో ప్రేమా పెళ్లి.. అయితే ఏంటి.. నటి ఫైర్
X

ఈడు జోడు అనే పదానికి అర్థం మారిపోతోంది. నచ్చిన వాడితో డేటింగ్.. మరీ నచ్చితే పెళ్లి.. ఎవరేమనుకుంటే నాకేం అనే ధోరణి పెరిగిపోతోంది. ఇది బాలీవుడ్‌లో మరీను. ఇంతకు ముందు పెళ్లయి పిల్లలున్న వారిని ఇష్టపడి మనువాడితే.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. నవ యవ్వనుల మీద మనసు పారేసుకుంటున్నారు 'ముదుర్' నాయికలు. ప్రియాంకా చోప్రాకి నిక్ జోనస్ నచ్చేసినట్లుగా.. ఇప్పుడు మలైకా అరోరాకి అర్జున్ కపూర్ తెగ నచ్చేశాడు. ఏమ్మా ఇంకెవరూ దొరకలేదా అన్నవారికి మలైకా.. మళ్లీ మాట్లాడకుండా ఘాటుగా సమాధానమిస్తోంది. ఓ మీడియా సంస్థ ఈ విషయం గురించి ప్రస్తావిస్తే.. దీనికి ఆమె.. ప్రజలు ఇతరులు చేసే ప్రతి పనినీ పరిశీలిస్తుంటారు, విమర్శిస్తుంటారు. ప్రతి సెలబ్రిటీకి ఈ పరిస్థితి ఎదురవుతుంది. అనేవారిని ఆపలేం. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు అని తనని తాను సమర్థించుకుంది. ఇటీవల మలైకా.. అర్జున్ ఫోటోను షేర్ చేస్తూ.. ఇతడు నావాడు అని పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాఫీ విత్ కరణ్ షోలో మాట్లాడిన మలైకా.. అర్జున్‌తో తన బంధాన్ని వివరించింది. ఏవరేమనుకుంటే నాకేంటి.. అవి అసలు పట్టించుకునే విషయాలే కాదన్నట్లు మాట్లాడింది. మలైకా ప్రస్తుతం పలు టీవీ షోలకు న్యాయనిర్ణతగా వ్యవహరిస్తూ, మరో పక్క యోగా స్టూడియోనూ నడుపుతోంది.

Next Story

RELATED STORIES