మహిళ అతి తెలివి.. గోధుమ పిండితో చేసిన పని చూస్తే..

మహిళ అతి తెలివి.. గోధుమ పిండితో చేసిన పని చూస్తే..
X

డబ్బులు కోసం ఓ మహిళ అతితెలివి ప్రదర్శించింది. గోధుమ పిండిని ముద్ద చేసి అప్పుడే పుట్టిన బిడ్డలా నమ్మించి డబ్బులు కొట్టేయాలనుకుంది. చివరకు అబాసుపాలైంది. మధ్యప్రదేశ్‌లోని మొరీనా జిల్లా కైలరాస్‌కు చెందిన ఓ మహిళ 'ఉదయ్‌ శ్రామిక్‌ సేవా సహాయత యోజన' క్రింద గర్భిణుల షోషకాహారం కోసం రూ. 1400, కాన్పు తర్వాత రూ. 16 వేలు ఇస్తారని తెలుసుకుంది. దీంతో ఎలాగైనా ఆ డబ్బులు దక్కించుకోవాలనుంది. దానికోసం ఓ పధకం వేసింది.. ఇంట్లో ఉన్న గోధుమపిండిని తీసుకొని అప్పుడే పుట్టిన బిడ్డలా దాన్ని తయారుచేసింది. దానికి ఓ గుడ్డకప్పి స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు భర్తతో కలిసి వెళ్ళింది.

అక్కడ ఉన్న నర్సును 'ఉదయ్‌ శ్రామిక్‌ సేవా సహాయత యోజన' కింద తన బిడ్డ పేరును నమోదు చెయ్యాలని కోరింది. దానికి ఆ నర్సు బిడ్డకు వైద్యపరీక్షలు చేసిన తరువాతే నమోదు చేస్తానని సమాధానం ఇచ్చింది. దానికి సదరు మహిళా ససేమీరా అన్నది. ఈ క్రమంలో ఆ మహిళ.. నర్సుతో వాగ్వాదానికి దిగింది. అయితే ఆమె చేతిలో బిడ్డపై నర్సుకు అనుమానం రావడంతో డాక్టర్లకు సమాచారం అందించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో గోధుమ పిండి ముద్ద కిందపడిపోయింది. వెంటనే ఆ మహిళ తన బిడ్డను చంపేశారంటూ భర్తతో సహా అక్కడినుంచి ఉండాయించింది. గోధుమపిండి ముద్దను చూసిన డాక్టర్లు ఇతర సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. డబ్బుకోసమే ఆ మహిళ ఈ పని చేసి ఉంటుందని భావించారు.

Next Story

RELATED STORIES