కాలం చెల్లిన నూనె ప్యాకెట్లపై J-ట్యాక్స్ ఎంత వసూలు చేశారు

కాలం చెల్లిన నూనె ప్యాకెట్లపై J-ట్యాక్స్ ఎంత వసూలు చేశారు

గుంటూరు జిల్లాలో వరద బాధితులకు.. కాలం చెల్లిన వంట నూనె ప్యాకెట్స్‌ పంపిణీ చేయడం... తీవ్ర దుమారాన్ని రేపింది. దీనిపై వరద బాధతులు మండిపడుతున్నారు. అటు లోకేష్‌ సైతం... ప్రభుత్వ తీరును నిలదీశారు. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఆ వంట నూనెల్ని వాపసు తీసుకుని కొత్త వాటిని ఇస్తామంటూ ప్రకటించారు గుంటూరు జిల్లా కలెక్టర్‌.

ఏపీలో జగన్‌ సర్కారు.... తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజాగ్రహానికి గురవుతోంది. ప్రధానంగా..... వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటున్నారు వరద బాధితులు. ఇదిలా ఉంటే.... వరదబాధితులకు ఏకంగా కాలం చెల్లిన వంటనూనెలను సరఫరా చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. జూలై నెలలో ఎక్స్‌ఫైర్‌ అయిన... వంటనూనెల పంపిణీ చేశారు జిల్లా అధికారులు. దీంతో బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమకు సహాయం అందించకపోగా.... కాలపరిమితి ముగిసిన వంట నూనెల్ని పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు జనం. ఇలాంటి నూనెలను వాడితే ప్రాణాంతమని, కనీస బాధ్యత, భయం లేకుండా అధికారులు ప్రవర్తిస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు..

మరోవైపు.... ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌. అధికారులు నిర్లక్ష్యంగా కాలం చెల్లిన వంటనూనెలు పంపిణీ చేసారన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్య భద్రత.... చిత్తు కాగితంతో సమానమని ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. అందుకే వరద బాధితులకకు కాలం చెల్లిన నూనె ప్యాకెట్లు సరఫరా చేశారని... ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. అంతే కాదు... ఈ పాత సరకు కొని..... జే ట్యాక్స్‌ ఎంత వసూలు చేశారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు లోకేష్‌...

Tags

Read MoreRead Less
Next Story