తాజా వార్తలు

పెద్దపులి మృత్యువాత కలకలం

పెద్దపులి మృత్యువాత కలకలం
X

కొమురం భీం జిల్లా సమీపంలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో మరో పెద్దపులి మృత్యువాత పడడం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా పోడ్సా గ్రామంలో పంట చేనులో పెద్ద పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వెంటనే అక్కడికి చేరుకున్న మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు పులి మృతిపై దర్యాప్తు చేపట్టారు. వేటగాళ్ల ఉచ్చుకు బలైందా?లేక ఏదైనా ప్రమాదం జరిగిందా? అన్నదానిపై విచారణ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో చంద్రపూర్‌ జిల్లాలో పెద్ద పులులు వరుసగా మృతి చెందడం చర్చనీయాంశమైంది.

Next Story

RELATED STORIES