విశాఖ ఏజెన్సీలో దారుణం

విశాఖ ఏజెన్సీలో దారుణం
X

విశాఖ జిల్లా అరకులో దారుణం చోటుచేసుకుంది. గిరిజన యువతి పుష్పపై మహేష్‌ అనే వ్యక్తి అత్యాచారం చేసి అనంతరం దారుణంగా హత్య చేశాడు. న్యాయం చేయాలంటూ... బాధితురాలి కుటంబసభ్యులు ఆందోళనకు దిగడంతో ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.విశాఖ ఏజెన్సీలో శుక్రవారం దారుణం జరిగింది. పుష్ఫ అనే యువతి దారుణహత్యకు గురైంది. మహేష్ అనే కిరాతకుడు ఈ దారుణగానికి ఒడిగట్టాడు. తనతో పెళ్లికి నిరాకరించందన్న కోపంతో... ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు మహేష్‌.

అరకు మండలం చినలబుడు గ్రామానికి చెందిన పుష్ప అనే గిరిజన యువతి స్థానిక మీసేవా కేంద్రంలో పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన మహేష్‌ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. భార్య ఇద్దరు పిల్లలు ఉన్న మహేష్‌.. రెండో పెళ్లి చేసుకుంటానని పుష్పను వేధిస్తున్నాడు. అయితే ఆమె దీనికి అంగీకరించలేదు. దీంతో పుష్పపై పగపెంచుకున్నాడు మహేష్‌. పెళ్లి గురించి మాట్లాడుకుందామంటూ... పుష్పను.. శరభగూడ స్కూల్‌కు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ వీరి మద్య తీవ్ర వాగ్యాదం జరిగింది. పెళ్లైన విషయం తనతో చెప్పలేదంటూ మహేష్‌తో గొడవకు దిగింది పుష్ప. ఇద్దరి మధ్య మాటమాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన మహేష్‌..... ఆమెను కాళ్లు చేతులు కట్టేసి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబుతుందేమోనన్న భయంతో.. బండరాయితో మోది కిరాతకంగా చంపినట్టు తెలుస్తోంది.

గతంలోనూ పుష్పను వివాహం చేసుకుంటానని మహేష్ తీసుకెళ్లాడు. అయితే పదిరోజుల క్రితం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఎవరికి వారే సొంత ఇళ్లకు వెళ్లారు. అనూహ్యంగా శుక్రవారం పుష్ప మృతదేహం కనిపించింది. మహేష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. పుష్ప హత్య విషయం తెలియగానే.. గ్రామస్తుల ఆగ్రవావేశాలు కట్టలు తెంచుకున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న మహేష్‌ను తమకు అప్పగించాలంటూ ఆందోళనకు దిగారు పుష్ప తల్లిదండ్రులు, బంధువులు. అయితే ... మహేష్‌కు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.

Next Story

RELATED STORIES