బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ప్రొఫైల్..

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ప్రొఫైల్..

తెలుగు తేజం, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సరికొత్త రికార్డు సృష్టించింది. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఎవరికి సాధ్యంకాని.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్‌లో ఆమె, జపాన్ షట్లర్ నొజోమీ ఒకుహారాను వరుస గేమ్‌లలో ఓడించింది. వరుసగా రెండు గేమ్‌లను గెలుచుకున్న సింధూ ఆటతో పాటు స్వర్ణపతకాన్ని కైవసం చేసుకుని..... భారత ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటింది. మొత్తంగా సింధూకు ఇది ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో ఐదో పతకం కావడం విశేషం. దీంతో చెనాకు చెందిన ఝంగ్‌ నింగ్‌ రికార్డును సమం చేసింది సింధు. 2013, 2014లో క్యాంసంతో సరిపెట్టుకున్న సింధూ... 2017, 2018లో రజత పతకాలు సాధించింది. ఇప్పడు ఏకంగా బంగారు పతకాన్ని సాధించింది..

పి.రమణ, విజయ దంపతులకు 1995 జూలై 5న జన్మించిన పీవి సింధూ ఎనిమిదేళ్ల వయస్సు నుంచి బ్యాడ్మెంటన్‌ ఆడటం ప్రారంభించింది. తల్లిదండ్రులిద్దరూ వాలీబాల్‌ క్రీడాకారులు. అయితే... సింధూ మాత్రం...పుల్లెల గోపిచంద్‌ స్పూర్తితో బ్యాడ్మింటన్‌ను‌ ఎంచుకుని అద్భుతాలు సృష్టిస్తోంది. 2009 కొలోంబోలో జరిగిన సబ్‌ జూనియర్‌ ఏషియన్‌ బాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో రజితం సాధించింది. ఆ తర్వాత 2010లో ఇరాన్‌ ఫాజిర్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌‌లో సిల్వర్‌ సాధించింది. అయితే... 2012లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టాప్‌ 20 జాబితాలో చోటు దక్కించుకోవడంతో... ఆమెకు తొలిసారి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 2013లో చైనాలో వరల్డ్‌ బ్యాడ్మెంటన్‌ చాంఫియన్‌ షిప్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. అదే ఏడాది మహిళల సింగిల్స్‌ ఫ్రిక్వార్టర్‌ ఫైనల్‌లోనూ రెండో సీడ్‌ యిహాన్‌ వాంగ్‌ను ఓడించింది సింధు. ఆ తర్వాత జపాన్‌ షట్లర్‌ కవోరిపై విజయం సాధించింది..

2016లో రియో ఒలంపిక్స్‌లో సెమీ ఫైనల్‌లో... జపాన్‌కు చెందిన నోజోమీ ఒకుహారాను ఓడించడం ద్వారా...ఫైనల్‌ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది సింధూ. ఆ తర్వాత జరిగిన ఫైనల్‌లో కరోలినా మారిన్‌తో పోరాడి పరాజంయ పాలైంది. అయితే.. అంత్యంత చిన్న వయస్సులో భారత్‌కు తొలి ఏకైక ఒలిపింక్స్ రజిత పతకం సాధించి పెట్టింది సింధూ. 2017, 2018లో సింధూ ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు సార్లు పైనల్‌కు‌ వచ్చి రెండో స్థానంలో సరిపెట్టుకుంది. అయితే... మూడో సారి ఫైనల్‌ ఫోబియాను అధిగమించి... సిందూ సత్తా చాటింది. ఇప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ షిప్‌లో ఏకంగా గోల్డ్ మెడల్ సాధించింది.

సింధూ ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో ఆమె కుటుంబసభ్యులు, బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సింధు కుటుంబసభ్యులు స్వీట్లు పంచుకొని, శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రపంచ చాంపియన్‌ షిప్ టైటిల్ కోసం సింధూ 6 నెలలుగా సాధన చేస్తోందని ఆమె తల్లి విజయ తెలిపారు. క్వార్టర్ ఫైనల్‌లో చైనీస్ తైపీ షట్లర్‌పై గెలవడం టర్నింగ్ పాయింట్ అన్నారు.

బ్యాడ్మెంటన్‌లో సింధూ ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం... .2014లో అర్జున అవార్డు, 2015 పద్మశ్రీ, 2016లో రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డుతో సత్కరించింది. మరోవైపు 2019లో ఫోర్బ్‌ ప్రకటించిన అత్యధిక సంపాదన గల అథ్లెట్ల్‌లో సింధూ 13 స్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించడంతో సరికొత్త రికార్డు సృష్టించిన సింధూ.... కెరీర్‌లో మరిన్ని అద్భుతాల విజయాలు సాధించాలని కోరుకుందాం.

Tags

Read MoreRead Less
Next Story