సమావేశానికి ఏపీ నుంచి సీఎం జగన్‌.. తెలంగాణ నుంచి హోం శాఖమంత్రి..

సమావేశానికి ఏపీ నుంచి సీఎం జగన్‌.. తెలంగాణ నుంచి హోం శాఖమంత్రి..
X

మావోయిస్టు ప్రాంతాలపై ఇవాళ కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించనుంది. దేశంలోని మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితిని బేరీజు వేసేందుకు కేంద్రం సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూ ఢిల్లీలో హోంశాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు పాల్గొననున్నాయి. ఏపీ తరపున సీఎం జగన్‌, ఇతర అధికారులు పాల్గొంటుండగా.. తెలంగాణ నుంచి హోం శాఖమంత్రి మహమూద్‌ ఆలీ, డీజీపీ మహేందర్రెడ్డి హాజరుకానున్నారు.

మరోవైపు మావోయిస్టు అగ్రనేతలంతా అబూజ్‌మాడ్‌లో ఉన్నట్టు భద్రతాదళాలు గుర్తించాయి. మోస్ట్‌ వాంటెండ్‌ మావోయిస్టులంతా ఇక్కడే మకాం వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అబూజ్‌మాడ్‌లో కేంద్ర బలగాలు పట్టు సాధించే దిశగా ముందుకు దూసుకుపోతున్నట్టు సమాచారం

గడిచిన నెల రోజుల్లో ఈ దండకారణ్యంలో జరిగిన నాలుగు ఎన్‌కౌంటర్‌ సంఘటనలో రెండు అబూజ్‌మాడ్‌ కొండల్లోనే సాగడం ఇందుకు నిదర్శనం. ఇటీవల అబూజ్‌మాడ్‌‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గడ్‌, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాలను ఆనుకుని ఉన్న నారాయణపూర్‌ ఖాంకేర్‌, రాజ్‌నంద్‌గామ్‌ జిల్లాల్లో విస్తరించిన అబూజ్‌మాడ్‌ ప్రాంతంలోని కొండలను స్థావరాలుగా ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. మావోయిస్టు పార్టీ సుమారు 38 ఏళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో పోటీ ప్రభుత్వాన్ని నడుపుతోంది.

Next Story

RELATED STORIES