ఎంత చల్లని వార్త.. ఏసీ రూ.800లకే..

ఎంత చల్లని వార్త.. ఏసీ రూ.800లకే..

ఎండలు మండిపోతున్నా ఏసీ కొనాలంటే అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఖరీదు వేలల్లో ఉండడంతో అటు వైపు చూడాలంటేనే భయపడుతుంటారు.. కూలర్లతో సరిపెట్టేస్తుంటారు. మరి రూ.800లకే ఏసీ వస్తుంటే ఎగిరి గంతేయరూ.. దానికి సంబంధించిన కధా కమామిషు తెలుసుకోవాలని ఆసక్తి చూపించరూ.. గుజరాత్‌లోని వడోదరకు చెందిన మనోజ్ పటేల్ రూ.800లకే ఏసీలను తయారు చేస్తున్నాడు. మట్టికుండలోని నీరు చల్లబడడానికి కారణం కుండకు వున్న అతి సూక్ష్మరంద్రాలని తెలుసు. అదే కాన్సెప్ట్‌ని ఉపయోగించి మనోజ్ చిన్న సైజు ఏసీలను తయారు చేశాడు. కాకపోతే ఇందులో మట్టికి బదులు పింగాణీ ఉపయోగించాడు. ప్రస్తుతం మనోజ్ మూడు మోడళ్ల ఏసీలను తయారు చేశారు. గది ఉష్ణోగ్రతలను 32 డిగ్రీల నుంచి 23 డిగ్రీల స్థాయికి తీసుకురాగల ఈ ఏసీలకు విద్యుత్ అవసరం ఉండదు. పింగాణీ ఏసీలో మాత్రం ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. ట్యాంకును ఒకసారి నింపితే 10 నుంచి 12 రోజుల వరకు ఆ నీటినే ఉపయోగించొచ్చు. పింగాణి, రాళ్లు, మట్టి మాత్రమే వాడుతుండడంతో ఖర్చు తక్కువగా ఉంటుందని చెబుతున్నారు మనోజ్.

Tags

Read MoreRead Less
Next Story