Top

అగ్రరాజ్యం అమెరికాకు అవమానం!

అగ్రరాజ్యం అమెరికాకు అవమానం!
X

అగ్రరాజ్యం అమెరికాకు జీ 7 దేశాల సదస్సులో అవమానం జరిగింది. ప్రాన్స్ లో జరుగుతున్న ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. అయితే ఇరాన్ విదేశాంగ శాఖమంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్, ప్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మెక్రాన్ తో రహస్యంగా సమావేశమయ్యారు. తమ శత్రుదేశమైన ఇరాన్ తో మిత్రదేశాధినేత సమావేశం కావడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ పై ఆంక్షలు విధిస్తూ... ఇతర దేశాలు ఇరాన్ తో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని పలుదేశాలపై ఒత్తిడి తెస్తున్న నేపధ్యంలో ఇరుదేశాల నేతలు సమావేశం కావడంపై అమెరికాకు చికాకు తెప్పిస్తోంది. జీ 7సదస్సు వేదికపై వీరు సమావేశం కావడంపై అమెరికన్ అధికారులు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు.

Next Story

RELATED STORIES