మూడేళ్ల చిన్నారి కడుపులో ఇనుపచువ్వ దిగి..

ఆడుకునే వయసు.. అమాయకత్వం.. అమ్మ వారిస్తున్నా వినకుండా మెట్లపై నుంచి దిగుతూ పట్టుతప్పి పిల్లర్‌పై పడిపోయాడు. దాంతో అక్కడ వున్న ఇనుప చువ్వ ఆ బాలుడి పొట్టలోకి దిగబడిపోయింది. ఛత్తీస్‌గఢ్ రాయపూర్ కర్చులియాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడియా గ్రామంలో మూడేళ్ల చిన్నారి కడుపులోకి ఇనుపచువ్వ దిగబడి వీపు నుంచి బయటకు వచ్చింది. అమ్మ పనిలో వుండి పిల్లాడిని గమనించుకోలేదు. బాలుడు బాధతో అరిచిన అరుపులకు అమ్మ పరుగున వచ్చి చూసింది. ఆ పరిస్థితిలో కుమారుడిని చూసిన తల్లి కంగారు పడిపోయి కుటుంబసభ్యుల సహకారంతో సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. నలుగురు వైద్య బృందం వెంటనే శస్త్ర చికిత్స చేసి బాలుడి కడుపులోని రాడ్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ చిన్నారి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడని మరి కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com