రాజధాని తరలింపుపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం

రాజధాని తరలింపు ప్రచారం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని కాంగ్రెస్, జనసేన, వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రాజధాని మార్చాలనుకోవడం అవివేకమన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రత్యర్ధులపై కోపంతోనో.. లేక సొంత వారి ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని రాజధాని తరలించే కుట్రలకు పాల్పడుతుందన్న అనుమానాలు వ్యక్తం చేశారు.

Tags

Next Story