కొరియర్ ఓపెన్ చేయగానే కెవ్వు కేక.. వీడియో

కొరియర్ ఓపెన్ చేయగానే కెవ్వు కేక.. వీడియో
X

ఆర్డర్ ఇచ్చింది ఒకటైతే మరొకటి వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. మరి ఆ వచ్చింది అనుకోని అతిధి.. రాళ్లు రప్పలూ పార్సిల్లో పంపిస్తున్నారని విన్నాడు కానీ.. ఇదేంట్రా బాబు ఇలా పాముల్ని పంపించడం ఏమిటి.. దాన్ని చూసి భయంతో వణికిపోతూ బాక్స్ మూసేసాడు.. బయటకు పరుగుతీశాడు. ఒడిషా రాష్ట్రం మయుర్బంజ్ జిల్లాలోని రాయ్ రంగపూర్‌‌కు చెందిన వ్యక్తికి కొరియర్‌లో వచ్చిన కోబ్రాని చూసి అందరూ షాకయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. వారు వచ్చి కోబ్రాని పట్టుకుని అడవిలో వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story

RELATED STORIES