మాంసాన్ని తయారు చేసేస్తున్నారు !!

మాంసాన్ని తయారు చేసేస్తున్నారు !!
X

ఇకపై మాంసం తినాలంటే జంతువులను వధించక్కరలేదంటున్నారు గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు. ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన ఈ మాంసం రుచితో పాటు అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. జంతువధను అరికట్టేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు. కృత్రిమ మాంసాన్ని తయారు చేసేందుకు తొలుత జంతువుల నుంచి చిన్న పాటి బయాప్సీల ద్వారా కండర ప్రొజెనిటర్ కణాలను సేకరిస్తారు. వీటిని తినడానికి వీలైన ఒక పదార్థ బేస్‌పై ఉంచి మాంసాన్ని వృద్ధి చేస్తారు. మాంసం ఉత్పత్తిలో పోషక విలువలను పెంచడానికి రోజువారీ మనం తీసుకునే ఆహార పదార్థాలనే వినియోగిస్తారు. కండరాల మూల కణాలతో కలిపి కొవ్వు, కార్టిలేజ్ లేదా ఎముక కణాలను పొరలు పొరలుగా వృద్ధిచేసే విధానంపైనా పరిశోధనలు సాగుతున్నాయి.

Next Story

RELATED STORIES