ఐఐటీ చదివి లక్షల జీతం కాదనుకుని..

ఐఐటీ చదివి లక్షల జీతం కాదనుకుని..
X

జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్ ఉండాలండి.. జేబు శాటిస్‌ఫ్యాక్షన్ కాదంటున్నాడు ఐఐటీ బాంబేలో చదివిన శ్రవణ్ కుమార్. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యాడు. భారీ ప్యాకేజీ ఇస్తామన్నారు. అయినా ఇష్టం లేదు. తక్కువ జీతం అయినా పర్లేదు. గవర్నమెంట్ జాబ్ కావాలి. హ్యాపీగా ఉండాలి. జాబ్ సెక్యూరిటీ ఉండాలి అని పోటీ పరీక్షలకు సిద్దమయ్యాడు. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన శ్రవణ్ 2010లో ఐఐటీ బాంబేలో చేరాడు. బీటెక్, ఎంటెక్ పూర్తి చేశాడు. అయినా సాప్ట్‌వేర్ కంపెనీలవైపు కన్నెత్తి కూడా చూడకుండా గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నాడు. అందుకోసం పోటీ పరీక్షలెన్నో రాశాడు. ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన గ్రూప్ డీ పరీక్షల్లో శ్రవణ్ పాస్ అయ్యాడు. ట్రాక్ మెయింటెనర్‌గా ఉద్యోగం

సంపాదించాడు. ప్రస్తుతం ధన్‌బాద్ రైల్వే డివిజన్ పరిధిలోని చంద్రపురాలో విధులు నిర్వహిస్తున్నాడు. మంచి జీతం వచ్చే ఉద్యోగాలు వదులుకుని తక్కువ జీతానికి పనిచేస్తున్నారేమిటి అంటే.. జీతం కాదు సంతృప్తి ముఖ్యం అంటున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నారు.

Next Story

RELATED STORIES