మైనర్ బాలికపై కన్నేసిన ల్యాబ్ టెక్నీషియన్.. ఒంటరిగా ఉన్న సమయంలో..

X
TV5 Telugu27 Aug 2019 4:31 AM GMT
కృష్ణా జిల్లా నందిగామలో కామాంధుడికి దేహశుద్ధి చేశారు స్థానికులు. కొత్త బస్‌స్టాండ్ దగ్గర్లో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఓ బాలిక పని చేస్తోంది. అదే సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న యువకుడి కన్నుఆ బాలికపై పడింది. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ల్యాబ్ టెక్నీషియన్ వెకిలి చేష్టలకు తెరలేపాడు. తరువాత ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. భయంతో బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి యువకుడికి దేహ శుద్ధి చేసి.. నందిగామ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనను మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
Next Story