జైట్లీ కుటుంబాన్ని పరామర్శించిన ప్రధాని మోదీ

జైట్లీ కుటుంబాన్ని పరామర్శించిన ప్రధాని మోదీ
X

బీజేపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. జీ-7 సదస్సు ముగించుకుని నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ.. ఇవాళ ఉదయం జైట్లీ నివాసానికి వెళ్లారు. అక్కడ మోదీకి అమిత్ షా ఆహ్వానం పలికారు. అనంతరం జైట్లీ చిత్రపటానికి పూలమాల వేసి మోదీ, అమిత్ షా నివాళులర్పించారు. జైట్లీ కుటుంబ సభ్యులకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అరుణ్ జైట్లీ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందినప్పుడు ...మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. జైట్లీ మృతి వార్త తెలుసుకున్న మోదీ.. విదేశీ పర్యటన మధ్యలోనే భారత్‌కు రావడానికి సిద్ధమయ్యారు. కానీ జైట్లీ కుటుంబ సభ్యుల సూచనతో మోదీ విదేశీ పర్యటన కొనసాగించారు.

Next Story

RELATED STORIES