కొత్త రూల్.. ఏటీఎం నుంచి ఇక రోజుకు ఒక్కసారే విత్ డ్రా

కొత్త రూల్..  ఏటీఎం నుంచి ఇక రోజుకు ఒక్కసారే విత్ డ్రా
X

ఏటీఎం కార్డు జేబులో ఉంది కదా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు డ్రా చేసుకుందామంటే ఇకపై నుంచి కుదరదంటున్నాయి బ్యాంకులు. బ్యాంక్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని నియంత్రించేందుకు ఢిల్లీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) విత్ డ్రాయల్స్‌పై పరిమితి విధించింది. ఒకసారి డబ్బులు డ్రా చేసిన తరువాత కనీసం 6 నుంచి 12 గంటలు గ్యాప్ ఉండాలి రెండో సారి డ్రా చేయాలంటే. బ్యాంకు మోసాలు చాలా వరకు అర్థరాత్రి నుంచి తెల్లవారు జామున జరుగుతుంటాయని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎండీ, సీఈవో ముకేశ్ కుమార్ తెలిపారు. ఏటీఎం మోసాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఢిల్లీ రెండోస్థానంలో ఉంది.

కార్డుల క్లోనింగ్ ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉంది. ఏటీఎం మోసాలకు పాల్పడే వారిలో విదేశీయులు ఎక్కువగా ఉన్నారు. బ్యాంకర్లు మోసాలు అడ్డుకునేందుకు పలు చర్యలు ప్రకటించారు. అందులో ఒకటి వన్ టైమ్ పాస్‌వర్డ్‌తో ఏటిఎం విత్ డ్రాయెల్ విధానం. ఇక్కడ ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయాలంటే ఓటీపీ అవసరం అవుతుంది. ఇది క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా నిర్వహించే ఆన్‌లైన్ లావాదేవీలను పోలి ఉంటుంది. అలాగే ఎవరైనా హెల్మెట్ పెట్టుకుని ఏటీఎం సెంటర్‌కి వెళ్తే.. హెల్మెట్ తీయండి అని వాయిస్ వినిపిస్తుంది. దాంతో అతడు కెమెరా కంటికి చిక్కుతాడు. ప్రస్తుతం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు చెందిన 300 ఏటీఎం సెంటర్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. త్వరలోనే బ్యాంకులన్నీ ఈ వ్యవస్థను ఏర్సాటు చేసే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES