ఆ నిర్ణయం ఓట్ల కోసం కాదు : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఆ నిర్ణయం ఓట్ల కోసం కాదు : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
X

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు ఓట్ల కోసం కాదన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. అక్కడి ప్రాంత అభివృద్ధి కోసం 370ని రద్దు చేశామన్నారు. ఆర్టికల్ 370 రద్దు 'ఉద్భవిస్తున్నఇండియాపై ప్రభావం' అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ప్రతిపక్షాలు చెబుతున్నట్టు అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు లేవని అంతా ప్రశాంతంగానే ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతున్నారు.. ఎమర్జెన్సీ సమయంలో ఇందీరాగాంధీ అనేక మందిని జైల్లో పెడితే అప్పుడు లేవా ప్రాథమిక హక్కులు అని ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. మాకు రాహుల్ గాంధీ, ఆజాద్ సర్టిఫికెట్ అవసరం లేదు... 370 రద్దు చేయమని మాకు ప్రజలు ఫుల్ మెజార్టీని ఇచ్చారన్నారు. జమ్మూకాశ్మీర్ ను చాలా ప్రక్షాళన చేయాల్సి ఉందని అందుకే కేంద్రప్రాలిత ప్రాంతం చేశామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

Next Story

RELATED STORIES