'మామా' వస్తున్నా నీ దగ్గరికి..

మామా వస్తున్నా నీ దగ్గరికి..
X

ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌ -2 మిషన్‌ సక్సెస్‌ఫుల్ గా చంద్రుడివైపు సాగుతోంది. ఒక్కొక్క ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తోన్న శాస్త్రవేత్తలు... ఇవాళ ఉదయం కూడా చంద్రయాన్‌ 2ను చంద్రుడికి మరింత దగ్గర చేసే ప్రక్రియను చేపట్టారు. చంద్రయాన్‌-2 క్లోజర్‌ను 4 వేల 300 కిలోమీటర్ల నుంచి 14 వందల 11 కిలోమీటర్ల వరకు ఉన్న మూన్‌ సర్ఫెస్‌ దగ్గరకు తీసుకెళ్లారు. ఈనెల 30న మరోసారి ఇలాంటి ప్రక్రియను చేపట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆ రోజు.. 14 వందల 11 కిలోమీటర్ల నుంచి 164 కిలోమీటర్లకి దగ్గరగా తీసుకుపోనున్నారు.

జులై 22న చంద్రయాన్-2 ప్రయోగం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని ప్రక్రియలను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఆరో ప్రక్రియను చేపట్టారు. ప్రయోగించిన 29వ రోజున వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. సెప్టెంబర్‌ 7న ల్యాండర్‌ మూన్‌పై ల్యాండ్‌ కానుంది. ఈలోపు మరికొన్ని క్లిష్టమైన ప్రక్రియలను పూర్తిచేయాల్సి ఉంటుంది.

సెప్టెంబర్‌ 2న ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్ విడిపోతుంది. సెప్టెంబర్ 7వ తేదీ వేకువజామున ఒంటి గంట 55 నిమిషాలకు చందమామపై విక్రమ్ ల్యాండర్‌ ల్యాండ్ అవుతుంది. 2 గంటల తర్వాత అందులోని ర్యాంప్ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుంది. సోలార్ ప్యానెళ్లు తెరుచుకుంటాయి. సరిగ్గా 4 గంటలకు జాబిల్లి ఉపరితలంపై రోవర్‌ తన పని మొదలు పెడుతుంది. అందుకోసం.. రోవర్‌లోని వ్యవస్థల్ని ముందుగానే రెడీ చేయాల్సి ఉంటుంది. ఈ పని సెప్టెంబర్‌ 3 నుంచి మొదలుపెట్టనున్నారు.

Next Story

RELATED STORIES