ఐదుగురు ఆడవాళ్లతో ఒకడు

నాని ఏ సినిమా చేసిన దానికో ప్రత్యేకత ఉంటుంది. ఆ యంగ్ హీరో సినిమా వస్తుందంటే చాలు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. తాజాగా నేచురల్ స్టార్ నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో హలీవుడ్ చిత్రాలను చూసి నాని పుస్తకాలు రాస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నాని వద్దకు ఓ చిన్నారితో కలిసి నలుగురు ఆడవాళ్లు వస్తారు. వాళ్లు తమ పగను తీర్చుకోవడానికి నాని సహాయాన్ని కోరుతారు. అలా వారు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ట్రైలర్ కొనసాగుతుంది. మధ్యలో ఆడవాళ్ళు చేసే కామెడీ కూడా ఉంటుంది. నాని కిల్ బిల్’ సినిమా చూసి ‘రశీదును చంపు’ అనే పుస్తకం రాశాడనే విషయంపై వేసే సెటైర్ కడుపుబ్బ నవ్విస్తుంది. ‘ఐదుగురు ఆడవాళ్లు, వాళ్లతో ఒకడు’ అంటూ విలన్ పాత్ర చేస్తున్న కార్తికేయ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ‘యుద్ధానికి సిద్ధం కండి.. సమరశంఖం నేను ఊదుతాను’ అంటూ ఐదుగురు ఆడవాళ్ళతో నాని చెప్పిన డైలాగ్ బాగుంటుంది, ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com