తాజా వార్తలు

విషాదం.. సాహో ఫ్లెక్సీ కడుతూ ప్రభాస్ అభిమాని..

విషాదం.. సాహో ఫ్లెక్సీ కడుతూ ప్రభాస్ అభిమాని..
X

సాహో సినిమా బ్యానర్ కడ్తూ ప్రభాస్‌ అభిమాని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ లో జరిగింది. పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితున్ని హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

రాజు.. ప్రభాస్ వీరాభిమాని. ఈ నెల 30న విడుదలయ్యే సాహో సినిమా ఫ్లెక్సీ ని తిరుమల థియేటర్ దగ్గర కడ్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ బైండింగ్ వైర్‌ అతనికి తగిలింది. కరెంట్‌ షాక్ తగలడంతో రాజు పై నుంచి కింద పడిపోయాడు. స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో రాజును హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Next Story

RELATED STORIES