తాజా వార్తలు

బోల్తా పడిన స్కూల్‌ బస్‌.. ముగ్గురు చిన్నారులు మృతి

బోల్తా పడిన స్కూల్‌ బస్‌.. ముగ్గురు చిన్నారులు మృతి
X

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో స్కూల్‌ బస్సు ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. వాగేశ్వరి ప్రైవేటు పాఠశాల బస్సు.... ఆర్టీసీ బస్‌ డిపో ముందు డివైడర్‌ను వేగంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో మనస్విని, దీక్షిత అనే చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా.. రితీష్‌ అనే విద్యార్థి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రి ఈటెల రాజేందర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అటు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES