తాజా వార్తలు

ఫ్లై ఓవర్‌ మీద బుసలు కొట్టిన నాగుపాము

ఫ్లై ఓవర్‌ మీద బుసలు కొట్టిన నాగుపాము
X

హైదరాబాద్‌ బేగంపేట ఫ్లై ఓవర్‌పై నాగుపాము హల్‌చల్ చేసింది. ఒక్కసారిగా ఫ్లై ఓవర్‌ మీదకు వచ్చిన పాము బుసలు కొడుతూ రోడ్డుపై పాకడంతో.. వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. మొదట డివైడర్‌ మధ్యలో ఉన్న పూలతొట్టిలోకి వచ్చిన పాము ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చేసింది. వాహనదారులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు.. పాములు పట్టే యువకుణ్ని పిలిచారు. చాకచక్యంగా పామును పట్టుకుని ఫ్లై ఓవర్‌ పక్కనున్న చెట్ల పొదల్లోకి వదిలేశారు. రద్దీగా ఉండే రోడ్డుపైకి ఒక్కసారిగా పాము రావడంతో.. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో బేగంపేట రోడ్డులో భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది.

Next Story

RELATED STORIES