తాజా వార్తలు

రూమ్‌లోకి పిలిచి దర్శకుడు చేసిన పనికి..

రూమ్‌లోకి పిలిచి దర్శకుడు చేసిన పనికి..
X

అన్ని రంగాల్లో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నా గ్లామర్ ఫీల్డ్‌లో అది ఒకింత ఎక్కువే. అవకాశాలకోసం ఎంతో మందిని కలవాల్సి వస్తుంది. దాన్ని ఆసరాగా తీసుకుని అవసరానికి వాడుకునే వారు కొందరైతే.. లొంగని వారిని వేధింపులకు గురిచేసేవారు మరికొందరు. కెరీర్ ఆరంభంలో ఇలాంటి అవమానాలను ఎన్నో భరించాల్సి వస్తుంది నటీమణులు. ఈ మధ్య కొందరు నటీమణులు తమకు జరిగిన అవమానాలను నలుగురితో పంచుకుంటున్నారు. బహిరంగంగా ఆయా వ్యక్తులను విమర్శిస్తున్నారు. సిగ్గుతో తలవంచుకునేలా చేస్తున్నారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో తాను కూడా ఇలాంటి అవమానాలనే ఎదుర్కున్నానని ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తెలిపారు. ఇటీవల ఆమె నటించిన మిషన్ మంగళ్ సినిమా విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కెరీర్ ప్రారంభించిన కొత్తల్లో చెన్నైలో ఉన్నప్పుడు ఓ దర్శకుడు నన్ను కలవడానికి వచ్చాడు.. మీతో మాట్లాడాలి రూమ్‌లోకి వెళ్దాం అన్నాడు. కాఫీ షాప్‌లో కూర్చుని మాట్లాడుకుందాం అంటే విన్లేదు. ఆయన మాట ప్రకారం హోటల్‌ రూమ్‌కి వెళ్లాం. లోపలికి వెళ్లగానే రూమ్ తలుపులు వేసి నాతో వెకిలిగా ప్రవర్తించాడు. దాంతో నాకు కోపం వచ్చి గట్టిగా మాట్లాడి తలుపు తీసి వెళ్లిపోమన్నట్లు చూశాను. వెంటనే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు అని ఆనాటి చేదు సంఘటన గుర్తు చేసుకున్నారు.

తనకు జరిగిన మరొక అవమానాన్ని గురించి ప్రస్తావిస్తూ.. ఓ నిర్మాతను కలుద్దామని అమ్మానాన్నలతో వెళ్తే.. అసలు నీది హీరోయిన్ ఫేసేనా. ఓ సారి అద్ధంలో చూసుకో అంటూ హేళనగా మాట్లాడరు. వారి మాటలు అప్పటికి బాధించినా హీరోయిన్‌గా ఎదిగి నేనేంటో నిరూపించుకోవాలనుకున్నాను. అవమానాలు ఎన్నెదురైనా తట్టుకుని అగ్ర హీరోయిన్ స్థాయికి ఎదిగిన విద్యాబాలన్ నేటి నటీమణులకు ఆదర్శం. అక్షయ్ కుమార్, విద్యాబాలన్ ముఖ్యపాత్రల్లో నటించిన మిషన్ మంగళ్‌లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

Next Story

RELATED STORIES