నటిపై దాడి.. తల్లితో కలిసి దాడికి దిగిన రూమ్‌మేట్

తనపై స్నేహితురాలు దాడి చేసిందంటూ బుల్లితెర నటి నళినీ నేగి పోలీసులను ఆశ్రయించింది. తన రూమ్‌మేట్ ప్రీతీ రానా, ఆమె తల్లితో కలిసి తనమీద దాడికి పాల్సడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రీతి రానాకు ఇల్లు లేకపోవడంతో కొద్ది కాలం తన ప్లాట్‌లో ఉండేందుకు ఆశ్రయం ఇచ్చానని, తర్వాత ఖాళీ చేయాల్సిందిగా కోరటంతో వారు తనపై దాడి చేశారని నళిని తెలిపారు.
నళిని, ప్రీతీ స్నేహితులు. వారిద్దరూ కొంతకాలం ఒకే రూమ్‌లో కలిసి ఉన్నారు. ఇటీవల నళిని ప్లాట్‌ను కొనుగోలు చేసి అందులో ఉంటోంది. ఈ సమయంలో ప్రీతి కూడా మరో చోటికి మారాలని భావించనప్పటికీ సరైన ఫ్లాట్ దొరకకపోవటంతో నళిని.. ప్రీతిని తన ఫ్లాట్‌లో కొద్ది రోజులు ఉండేందుకు అంగీకరించింది. ఆ తర్వాత ప్రీతి తల్లి, స్నేహలత కూడా ఆ ప్లాట్‌లోకి రావడంతో వారి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఫ్లాట్ ఖాళీ చేయకపోగా నళినీ వ్యక్తిగత విషయాలలో ప్రీతి జోక్యం చేసుకోవడంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. చివరకు ఈ గొడవలు భౌతిక దాడి వరకు వెళ్ళాయి. ప్రీతి, తన తల్లి, స్నేహితులతో కలిపి నళినీపై దాడికి దిగారు. ఈ దాడిలో గాయపడిన నళిని పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com