చిదంబరం అరెస్ట్‌పై స్పందించిన ఇంద్రాణీ ముఖర్జి

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టు పై ఐఎన్‌ఎక్స్ మీడియా సహవ్యవస్థాపకురాలు ఇంద్రాణీ ముఖర్జి స్పందించారు. ఆయన అరెస్టు కావడం శుభవార్తని అన్నారు. తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణీని ట్రయిల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చిదంబరం అరెస్టు కావడం శుభవార్త. ఆయనను అన్ని వైపుల నుంచి కట్టడి చేశారు. ఇదే కేసులో కార్తీ చిదంబరానికి మంజూరైన బెయిల్ కూడా రద్దు కావాలి'' అని వ్యాఖ్యానించారు.
ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న చిదంబరాన్ని సీబీఐ అధికారులు ఈ నెల 21న అరెస్టు చేశారు. ఇదే కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణీ కీలక వాంగ్మూలం ఇచ్చింది. ఈ స్టేట్‌మెంట్ ఆధారంగానే సీబీఐ అధికారులు చిదంబరాన్ని అరెస్టు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com