షాహిద్ అఫ్రిదికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన గౌతమ్‌ గంభీర్

షాహిద్ అఫ్రిదికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన గౌతమ్‌ గంభీర్
X

పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి మరోసారి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్‌ గంభీర్. నియంత్రణ రేఖ వద్దకెళ్లి శాంతి పతాకం ఎగరేస్తానని బుధవారం వ్యాఖ్యలు చేశారు అఫ్రిది. ఈ కామెంట్స్‌పై స్పందించిన గంభీర్ అతడికి వయసు, బుర్ర పెరగలేదని ఎద్దేవా చేశారు. కొందరు మనుషులకు తాము ఏం మాట్లాడుతున్నామో అర్థంకాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అఫ్రిది ప్రతీది రాజకీయం చేయాలనుకుంటున్నారని గంభీర్ ఫైరయ్యారు. అదే తన ఉద్దేశం అయితే పాలిటిక్స్‌లోకి ఎందుకు రావడం లేదని నిలదీశారు.

మరో ట్వీట్‌లో ఇంకో ఫోటో షేర్‌ చేసిన గంభీర్.. అఫ్రిదితో మరో అఫ్రిది మాట్లాడుతున్నాడు చూడండి అంటూ ఎద్దేవా చేశారు. కిండర్ గార్డెన్ పాఠాలు నేర్చుకోవడానికి ఆన్‌లైన్‌లో ఆర్డరివ్వు అఫ్రిది అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ సైన్యం శుక్రవారం మధ్యాహ్నం కశ్మీర్‌ అవర్‌ను పాటించనుంది. ఈ నేపథ్యంలోనే తాను నియంత్రణ రేఖ వద్దకు వెళ్లి శాంతి పతాకాన్ని ఎగరేస్తానని అఫ్రిది వెల్లడించారు.

Next Story

RELATED STORIES