జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు

జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత విధించిన ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నారు. జమ్మూ ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో మొబైల్ ఫోన్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. దోడ, కిష్టావర్, రాంబాన్, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో మొబైల్ ఫోన్ సర్వీసులను పునరుద్ధరించారు. ఆగస్టు 5వతేదీ నుంచి జమ్ముకశ్మీర్‌లో మొబైల్ ఫోన్, ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేశారు. మొబైల్ ఫోన్, ఇంటర్ నెట్‌ను టెర్రరిస్టులు వినియోగిస్తున్నందు వల్లే ఈ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక అన్ని ఆంక్షలను తొలగిస్తామని జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పారు.

జమ్మూకశ్మీర్ లో పరిస్థితిలు చక్కబడటంతో .... నిషేధాజ్ఞలను విడుతలవారిగా సడలిస్తున్నారు. కశ్మీర్‌ లోయలో ప్రశాంత వాతావరణం నెలకొంటుండడంతో ఆగస్ట్‌ 17న పలు ప్రాంతాల్లో ల్యాండ్‌ లైన్‌ సేవలను పునరుద్దరించారు అధికారులు. అనంతరం 2జీ మొబైల్ ఇంటర్నెట్ ను జమ్ము, రేసాయ్, సాంబా, కతువా, ఉధంపూర్ జిల్లాల్లో ప్రారంభించారు. ఇక ఇవాల్టి నుంచి మరో ఐదు జిల్లాల్లో మొబైల్‌ సేవలను పునరుద్దరించినట్టు వెల్లడించారు.

ఇప్పటికే మూడువేల ప్రాథమిక స్కూళ్లు, వెయ్యి హైస్కూళ్లు పునరుద్ధించారు. ఇక లడఖ్‌లో అన్ని స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. పరిస్థితులు సాధారణస్థితికి చేరుకుంటండటంతో... ఇప్పుడు మొబైల్‌ ఫోన్లను సైతం పునరుద్ధరించారు. మరోవైపు... రెండు నెలల్లో కేంద్రం భారీగా ఉద్యోగ ప్రకటన చేస్తుందన్నారు గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌. దాదాపు 50వేల ఉద్యోగాల్ని కల్పించడంతో పాటు 50 కాలేజీలు కూడా ఈ ప్రాంతంలో వస్తాయన్నారాయన.

Tags

Read MoreRead Less
Next Story