Top

హైదరాబాద్ లో భారీగా పేలుడు పదార్థాల పట్టివేత

హైదరాబాద్ లో భారీగా పేలుడు పదార్థాల పట్టివేత
X

హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌ వద్ద పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాల పట్టివేత కలకలం రేపింది. DCM వ్యానులో తరలిస్తున్న 10టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు ఆర్టీఐఏ పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. కిషన్‌ గూడ ఓఆర్‌ఆర్‌ టోల్‌ గేట్‌ వద్ద DCM వ్యానులో సోదాలు నిర్వహించిన పోలీసులు .. తప్పుడు వే బిల్లులు సృష్టించి వ్యానులో 200 బస్తాల అమ్మోనియం నైట్రేట్‌‌ను తరలిస్తున్నట్లు గుర్తించారు. భువనగిరి నుంచి చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి ఈపేలుడు పదార్థాలు అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిపారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Next Story

RELATED STORIES