శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై..

ఇప్పటిదాకా తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులకు ప్లాస్టిక్ కవర్లలో లడ్డూ ప్రసాదాలు అందజేస్తూ వస్తున్నారు. దీనివలన ప్లాస్టిక్ కవర్ల వినియోగం ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు టీటీడీ అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను జూట్(జనపనార)బ్యాగుల్లో పెట్టి ఇవ్వాలని నిర్ణయించారు. సెంట్రల్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా తయారీ ధరకే జనపనార సంచులను టీటీడీకి విక్రయించాలని నిర్ణయించింది. జూట్ బ్యాగులు అందుబాటులోకి రావడంతో సోమవారం నుంచే లడ్డూలను వీటిలో పెట్టి అందజేస్తున్నారు అధికారులు. ఇక వీటిని సెపరేట్ గా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాదాపు కిలో బరువు మోసే సామర్థ్యం ఉన్న జూట్ బ్యాగు ధర.. రూ.25 ఉంది.. ఇందులో ఐదు నుంచి ఆరు లడ్డూలు వేసుకోవచ్చు. అలాగే 2కిలోల బరువు మోసే సామర్థ్యం ఉన్న జూట్ బ్యాగు ధర.. రూ.30 ఉంది.. ఇందులో 8 నుంచి 10 లడ్డూలు పడతాయి. ఇక 4 కిలోల బరువు మోసే బ్యాగు.. రూ. 35 .. ఇందులో 15 లడ్డూలు తీసుకెళ్లవచ్చు. రూ.55 బ్యాగులో పాతిక లడ్డూలు పెట్టుకోవచ్చు. ఇది 10 కిలోల బరువు మోయగలదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com