వైసీపీ ప్రభుత్వ క్రీడా పరిజ్ఞానంపై లోకేశ్ సెటైర్‌

వైసీపీ ప్రభుత్వ క్రీడా పరిజ్ఞానంపై లోకేశ్ సెటైర్‌

పీటీ ఉష టెన్నిస్‌ ప్లేయర్‌. ఏంటి డౌటా. సాక్షాత్తు ఏపీ ప్రభుత్వమే ఆ విధంగా బ్యానర్లపై రాయించింది. నేషనల్‌ స్పోర్ట్స్‌ డే సెలబ్రేషన్స్‌ పేరుతో YSR క్రీడా ప్రోత్సాహకాలు ఇస్తామని ఏపీ గవర్నమెంట్‌ పేల్చిన సీరియస్‌ జోక్‌ అది. బ్యానర్‌పై టెన్నిస్‌ అని రాసి సానియా మిర్జా ఫోటో పెట్టి కింద పి.టి. ఉష అని రాసి అడ్డంగా బుక్కయింది ఏపీ గవర్నమెంట్‌.

ఈ బ్యానర్‌ ఫోటోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన ట్విట్టర్‌ ఖాతాలో పెట్టారు. జాతీయ క్రీడా దినోత్సవం రోజు వైసీపీ పాలకుల క్రీడా పరిజ్ఞానంపై సెటైర్లు వేశారు. అటు పక్క ఫోటోలో ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ సొంతం చేసుకున్న పి.వి.సింధు, ట్రెయినర్‌ పుల్లెల గోపీచంద్‌లతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోటో పెట్టారు.

చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో క్రీడాకారులు గోపీచంద్‌కు ఐదెకరాల స్థలం ఇచ్చి బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుకు సహకరించారని లోకేశ్ ట్వీట్‌ చేశారు. ఇప్పుడా అకాడమీ సింధులాంటి ఆణిముత్యాలను దేశానికి అందిస్తోందన్నారు. అది చంద్రబాబు దార్శనికత అని లోకేశ్ ట్వీట్‌ చేశారు. క్రీడలకు ఇచ్చే ప్రోత్సాహం అటుంచి, పార్టీ నేతల క్రీడా పరిజ్ఞానంతో క్రీడాకారులను అవమానించకపోతే చాలు అన్నారు. సానియా మిర్జా ఎవరో, పి.టి. ఉష ఎవరో తెలియని దురావస్థలో క్రీడా శాఖ మంత్రి ఉన్నారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story