65 ఏళ్ల ప్రియుడు.. 23 ఏళ్ల ప్రియురాలు.. ఇద్దరూ కలిసి..

65 ఏళ్ల ప్రియుడు.. 23 ఏళ్ల ప్రియురాలు.. ఇద్దరూ కలిసి..

ఆయన్లో ఏం నచ్చిందో ఆమె ఫ్లాటైపోయింది. వయసు అంతరం గుర్తుకు రాలేదు. మనసు మాట విననంది. తాత వయసున్న వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం సాగిస్తున్నారు. టీవీ రిమోట్ విషయంలో గొడవ పడ్డారు. అది కాస్తా పోలీసుల దాకా వెళ్లింది. ఫ్లోరిడాలోని ఫామ్ బీచ్ కౌంటీకి చెందిన 23 ఏళ్ల అంబర్ బ్లాక్ అనే యువతి 65 ఏళ్ల వృద్దుడితో సహజీవనం చేస్తోంది. శుక్రవారం రాత్రి ఇద్దరూ కలిసి టీవీ చూస్తున్నారు. ప్రియుడి చేతిలో ఉన్న రిమోట్ తీసుకుని ఛానెల్ మార్చబోయింది అంబర్. దానికి ప్రియుడు రిమోట్ ఇవ్వనన్నాడు. చూడరాదు ఏదో ఒకటి అనేసరికి అంబర్‌కి చిర్రెత్తుకొచ్చింది.

నాకిష్టమైంది చూస్తాను. నువ్వు చూసేది నేనెందుకు చూడాలి అని గొడవకు దిగింది అతడితో. అలా మొదలైన గొడవ కాస్తా మాటా మాటాపెరిగి ప్రియుడ్ని కింద పడేసి కొట్టే స్థాయికి వెళ్లి పోయింది. అతడి మీదపడి గోళ్లతో రక్కింది. ముఖంపై ఆపకుండా పిడిగుద్దులు గుద్దింది. పాపం చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పనైంది వృద్ధుడికి. ఆమెనుంచి ఎలాగోలా తప్పించుకుని బతుకు జీవుడా అనుకుంటూ పోలీసులకు సమాచారం అందించాడు. ఎంతపొరపాటు చేశాను. నా వయసేంటి నేను చేసిన పనేంటి అని ఆనక చింతించాడు. పోలీసులు వచ్చిందాక బయట కూర్చుని వారు వచ్చాక ఆమె చేసిన పనిని వివరించాడు. అతడి ఫిర్యాదు మేరకు అంబర్‌ను పోలీసులు అరెస్టు చేసారు.

Tags

Read MoreRead Less
Next Story