పోలీస్‌ కస్టడీలో ఉన్న మూడు తాబేళ్లకు స్వేచ్ఛ కల్పించిన కోర్టు

పోలీస్‌ కస్టడీలో ఉన్న మూడు తాబేళ్లకు స్వేచ్ఛ కల్పించిన కోర్టు

సాధారణంగా.. కస్టడీలు, రిమాండ్‌లు నిందితులకు విధిస్తుంటారు. కానీ.. ఆశ్చర్యంగా మూడు తాబేళ్లు నాలుగేళ్ల పాటు పోలీస్‌ కస్టడీలో ఉన్నాయి. ఇన్నాళ్లకు కేసు పూర్తి కావడంతో వాటికి స్వేచ్ఛ లభించింది. దీంతో వాటిని నదిలోకి విడుదల చేశారు అధికారులు. అందరిని ఆశ్చర్య పరిచే ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలో జరిగింది.

2015లో రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలో.. చేతబడి చేశారన్న అనుమానంతో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. చేతబడికి ఉపయోగించిన 3 తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆరుగురుని జైలుకు తరలించారు. నాలుగేళ్లపాటు కోర్టులో ఈ కేసు నానుతూ వచ్చింది. ఇన్నాళ్లు ఈ మూడు తాబేళ్లకు.. తమ కస్టడిలో రక్షణ కల్పిస్తూ వచ్చారు పోలీసులు.

ఎట్టకేలకు.. రాజ్‌నంద్‌గావ్‌ జిల్లా కోర్టు తీర్పుతో ఈ మూడు తాబేళ్లకు రిలీఫ్‌ లభించింది. పోలీస్‌ కస్టడీ నుంచి తాబేళ్లను విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది కోర్టు. దీంతో తాబేళ్లను పోలీస్‌ కస్టడీనుంచి విడుదల చేయాలని పోలీసుల్ని ఆదేశించింది కోర్టు. వన్యప్రాణి అధికారుల సహాయంతో.. పోలీసులు.. ఈ తాబేళ్లను శివ్‌నాథ్ నదిలో వదిలిపెట్టారు. తాబేళ్లను నీళ్లలో విడుదల చేస్తున్న సమయంలో.. జనం పెద్ద సంఖ్యలో అక్కడి చేరుకుని.. ఈ వింతను చూశారు.

Tags

Read MoreRead Less
Next Story