మీరు నడపకుండానే నడిచే బైక్.. మార్కెట్లోకి వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే..

మీరు నడపకుండానే నడిచే బైక్.. మార్కెట్లోకి వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే..

కృత్రిమ మేధతో పనిచేసే కార్లు, కంప్యూటర్లు ఇప్పటికే మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు బైక్‌లు కూడా వచ్చేశాయి. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రివోల్ట్ కృత్రిమ మేధతో పనిచేసే ఎలక్ట్రిక్ బైక్‌ను మన దేశ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది దేశంలో తొలి ఏఐ బైక్ అని సంస్థ పేర్కొంది. రీవోల్ట్ ఆర్‌వీ 400. ఇది 125 సీసీ బైక్ లిథియం-అయాన్ బ్యాటరీతో పని చేస్తుంది. ఒకసారి చార్జి చేస్తే 156 కిలోమీటర్లు వెళుతుంది. ఫుల్ చార్జింగ్ కావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఆర్‌వీ 400 బైక్‌లో 4జీ ఎల్‌టీఈ సిమ్ అమర్చుకోవచ్చు. దీని సాయంతో ఇంటర్నెట్ ద్వారా నావిగేషన్, జీపీఎస్ వంటి సదుపాయాలు పొందొచ్చు. దీన్ని బట్టి బైక్‌లోని లోపాలను కనిపెట్టొచ్చు. ప్రస్తుతం ఈ బైక్ ఢిల్లీ, పుణె మార్కెట్లో అందుబాటులో ఉంది. త్వరలో ఇతర నగరాలకూ సరఫరా చేస్తారు. నెలకు రూ.3,499లు చొప్పున 37 నెలలు ఈఎమ్‌ఐ కట్టి బైక్ సొంతం చేసుకోవచ్చు. ఆన్ రోడ్ ధర రూ.1.48 లక్షల వరకు వుండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఫీచర్ల విషయానికి వస్తే.. 215 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, ఐపీ 67 వాటర్ డస్ట్ రెసిస్టెన్స్‌ డిజిటల్ డిస్‌ప్లే, ముందూ వెనుకా డిస్క్ బ్రేకులు, 3.24 కిలో వాట్ల బ్యాటరీ‌తో యూత్‌ని ఆకర్షిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story