కత్తులతో దాడులకు తెగబడ్డ వైసీపీ నేతలు..

కత్తులతో దాడులకు తెగబడ్డ వైసీపీ నేతలు..

కుదిరితే పక్క పార్టీపై దాడులు.. లేదంటే అంతర్గత కుమ్ములాటలు. మొత్తానికి ఘర్షణ వాతావరణంలోనే ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నాలు. వైసీపీపై గత కొద్దిరోజులుగా టీడీపీ చేస్తున్న విమర్శలు ఇవి. టీడీపీ ఆరోపణలకు తగ్గట్టుగానే టీడీపీ నేతలపై దాడులకు తోడు పార్టీలో గ్రూప్ వార్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలోని పాల్తేరు గ్రామంలో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ నెల 21వ తేదీన పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు గ్రామ సందర్శనకు రావడంతో సభ ఏర్పాటు చేశారు. ఈ విషయంలో కుంకుపూడి నాగ శివ రామకృష్ణ, అనిశెట్టి వెంకటసూరిలతో దేవరపు శ్రీనివాస్, మధు అనే వ్యక్తులు గొడవపడ్డారు. అయితే గ్రామ పెద్దమనుషులు సర్దిచెప్పడంతో ఇరు వర్గాలు వెనక్కు తగ్గాయి. పరిస్థితి సద్దుమణిగింది అనుకున్నారు. కానీ, వాసు, మధు కలిసి శివరామకృష్ణ, అనిశెట్టి సూరిలపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు.

కత్తులతో దాడులకు తెగబడిన వైసీపీ నేతలపై కేసు కేసు నమోదు చేశారు పోలీసులు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. ఈ రాజకీయ దాడుల కల్చర్ పై కొద్దికాలంగా టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు మాజీ హోంమంత్రి చినరాజప్ప. రాజకీయదాడులకు తోడు.. రాష్ట్రంలో మైనర్‌ బాలికల మిస్సింగ్‌లు ఎక్కువయ్యాయని చినరాజప్ప ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టి, నేరాలను అదుపు చేయాలని సూచించారు. పాయకరావుపేటలో చోటుచేసుకున్న ఘటన వైసీపీ మార్క్ రాజకీయాలకు అద్దం పట్టేలా ఉన్నాయని టీడీపీ విమర్శిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story