'ఐరా'కి మీ ఆశీర్వాదం కావాలి

ఐరాకి మీ ఆశీర్వాదం కావాలి
X

నటుడు విష్ణు రీసెంట్‌గా జన్మించిన తన కూతురు ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఆ చిన్నారి ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. పాపకి ఐరా విద్య అని నామ‌క‌ర‌ణం చేసినట్లు తెలిపారు. ఐరాకి మీ ప్రేమ‌, ఆశీర్వాదం కావాల‌ని కోరారు. నటుడిగా పేరు తెచ్చుకున్న విష్ణు 2009 మార్చిలో విరానిక‌ని ప్రేమ వివాహం చేసుకున్నారు. డిసెంబ‌ర్ 2011లో వీరికి ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. వారికి అరియానా, వివియానా అని పేరు పెట్టారు. 2018లో వారు మరో బిడ్డకు జ‌న్మనిచ్చారు. ఆ బేబీ బాయ్‌కి అవ్రామ్ భక్త అని పేరు పెట్టారు. తాజాగా వారికి మరో ఆడబిడ్డ పుట్టింది.

అయితే ఇటీవల జన్మించిన తన నాలుగో బిడ్డ డెలివ‌రీని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెడ‌తాన‌ని విష్ణు ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇలా చేయమని కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న‌కి స‌ల‌హా ఇచ్చిందని విష్ణు ట్వీట్ లో తెలిపాడు. దీనికి విరానికా.. విష్ణుకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. మిమ్మ‌ల్ని ఇద్ద‌రిని మామూలుగా కొట్ట‌నంటూ రీట్వీట్ చేసింది. విరానికా కౌంటర్‌కు స్పందించిన విష్ణు కొన్ని బెదిరింపుల వ‌ల‌న ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఇవ్వాల‌నే ఆలోచ‌న విర‌మించుకున్నాను. ఆమెకి మోహ‌న్ బాబు స‌పోర్ట్ ఉంది. దీంతో నిర్ణ‌యం మార్చుకోక త‌ప్ప‌లేదు అంటూ సరదాగా స్పందించాడు.

Next Story

RELATED STORIES