VRO కాలర్ పట్టుకున్న మహిళా రైతు.. చివరకు..

భూ సమస్య పరిష్కరించాలంటూ VRO చుట్టు తిరిగీ తిరిగీ ఆ మహిళా రైతుకు ఓపిక నశించింది. నువ్వు అడిగినన్ని పైసలిచ్చి ఏడాదిగా తిరుగుతున్నా... నా సమస్యను పట్టించుకోవా అని VRO రామలింగంను కాలర్ పట్టుకుని కార్యాలయం బయటికి లాక్కొచ్చి మరీ నిలదీసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగింది.
బాధితురాలి పేరు పోచమ్మ. మేడుకుంద స్వగ్రామం. తన పేరిట ఉన్న పట్టా భూమిని కొడుకుల పేరుమీద రాశారనేది ఆమె ఫిర్యాదు. షర్ట్ కాలర్ పట్టుకోవడంతో VRO ఈగో హర్ట్ అయింది. దీంతో ఆమెపై దాడి చేసి కిందకు తోసేశాడు VRO. స్పృహ కోల్పోయిన పోచమ్మను 108లో ఆసుపత్రికి తరలించారు.
మేడుకుంద గ్రామానికి చెందిన బీరయ్య తన ఇద్దరు భార్యలు చనిపోవడంతో పోచమ్మను మూడో పెళ్లి చేసుకున్నాడు. బీరయ్య చనిపోయే ముందు ఆస్తిని ముగ్గురు భార్యలకు పంచాడు. పోచమ్మను ఆదరించేవారు లేక వలస వెళ్లి జీవిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం భూ ప్రక్షాళన మొదలుపెట్టింది. ఆ సమయంలో బీరయ్య మొదటి భార్య కొడుకు తన చిన్నమ్మ అయిన పోచమ్మ చనిపోయినట్టు రికార్డు సృష్టించి పొలం కాజేశాడు. విషయం తెలుసుకున్న పోచమ్మ అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతోంది. పోచమ్మ నేరుగా తన వద్దకే వస్తే సమస్య పరిష్కారమయ్యేదన్నారు MRO. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com