'పీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వకుంటే వేరే ఆప్షన్లు చూసుకుంటా'

పీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వకుంటే వేరే ఆప్షన్లు చూసుకుంటా

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌ రూపంలో కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి వచ్చిపడింది. మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా తనను నియమించాలని కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి అల్టిమేటమ్‌ జారీ చేశారు. ఒక వేళ తనను పీసీసీ చీఫ్‌గా నియమించకపోతే ఆప్షన్లు చూసుకుంటానని సింధియా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అయితే ఇప్పటికే సింధియా కొందరు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం.

మధ్యప్రదేశ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక పీసీసీ చీఫ్‌ పదవిని కమల్‌నాథ్‌ విడిచిపెడతారని అంతా భావించారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా కమల్‌నాథ్‌ పీసీసీ చీఫ్‌ పదవిని వదిలిపెట్టలేదు. ఇక డిప్యూటీ సీఎం పోస్ట్‌ అయినా ఇస్తారని జ్యోతిరాదిత్య సింధియా అనుకున్నారు. కానీ అదికూడా రాకపోయే సరికి పీసీసీ చీఫ్‌ పోస్ట్‌పై ఆశలు పెట్టుకున్నారు సింధియా. కానీ పార్టీ హైకమాండ్‌ పట్టించుకోకపోవడంతో తాజాగా ఆయన అల్టిమేటమ్‌ జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story