నటుడిని చితకబాదిన జనం.. కారణమేమిటంటే..

మన దేశంలో సినిమా స్టార్స్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. వారు ఎక్కడికి వెళ్లినా చూడడానికి భారీ సంఖ్యలో జనాలు వస్తారు . చిన్న నటులైనా సరే వాళ్ళను ఈజీగా గుర్తుపట్టేసి ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపుతారు. కొందరు నటులు అభిమానులకు సహకరిస్తే మరికొందరు అసహనానికి గురై జనాలపై వారి ప్రతాపాన్ని చూపిస్తారు. ఇలానే ఫోటోలు దిగుదామని వచ్చిన అభిమానులతో దురుసుగా ప్రవర్తించాడు కన్నడ నటుడు, దర్శకుడు హెచ్చా వెంకట్ కొడగు. అతని ప్రవర్తనతో కోపోద్రిక్తులైన జనం దేహశుద్ది చేశారు.
హెచ్చా వెంకట్ కర్ణాటకలోని కొడగు జిల్లాలోఉన్న ఓ హోటల్ కు వెళ్ళాడు. అక్కడికి అతడు వస్తున్నాడని తెలుసుకున్న జనం భారీ సంఖ్యలో ఆ హోటల్‌కు చేరుకున్నారు. వెంకట్‌తో ఫోటోలు దిగడానికి జనం ప్రయత్నించారు. దీంతో అసహనానికి గురైన అతను బయటకు వచ్చి కనిపించిన కారుపై రాళ్లు విసిరాడు.. కారు అద్దాలు పగలాయి. దీంతో అక్కడ ఉన్న ప్రజలు హెచ్చా వెంకట్ కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com