మరో సంచలన నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం

మరో సంచలన నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం
X

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ రంగంలో విలీన ప్రక్రియను మోదీ సర్కారు వేగవంతం చేసింది. తాజాగా మరో 10 బ్యాంకులను కేంద్రం విలీనం చేసింది. యూనియన్ బ్యాంక్, కార్పొరేషన్, కెనెరా, ఆంధ్రా బ్యాంకు, యునైటెడ్, ఓబీసీ, సిండికేట్, పీఎన్‌బీ సహా 10 బ్యాంకులను కలిపి 4 బ్యాంకులుగా చేశారు. ఓరియంటల్, యునైటెడ్ బ్యాంక్‌, పీఎన్‌బీలను కలిపి ఓ బ్యాంకుగా మార్చారు. కెనెరా బ్యాంకును సిండికేట్ బ్యాంకులో విలీనం చేశారు. యూనియన్, ఆంధ్రా బ్యాంక్ సహా కార్పొరేషన్ బ్యాంకును కలిపి ఒకే బ్యాంకుగా మార్చేశారు. ఇండియన్ బ్యాంక్, అలాహాబాద్‌ బ్యాంకుతో కలిపారు. బ్యాంకుల విలీనంతో వినియోగదా రులకు మరింత మేలు జరుగుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచుతామని నిర్మలా సీతారామన్ చెప్పారు.

బ్యాంకుల విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గనుంది. ఆర్థిక సంస్కరణలతో వృద్ధి రేటు పుంజుకుంటుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బ్యాంకుల నిరర్ధక ఆస్తుల సంఖ్య 8.65 లక్షల కోట్ల నుంచి 7.13 లక్షల కోట్లకు తగ్గిందని ఆర్థికమంత్రి చెప్పారు. రుణాల రికవరీ పెరుగుతోందని, 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 14 బ్యాంకులు లాభాలబాట పట్టాయని చెప్పారు.

Next Story

RELATED STORIES