పరిశ్రమలో భారీ పేలుడు.. 20 మంది మృతి

పరిశ్రమలో భారీ పేలుడు.. 20 మంది మృతి
X

మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో ఉన్న ఓ రసాయనిక పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సిలిండర్లు పేలుడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 8 మృతదేహాలను వెలికితీశారు ఫైర్‌ సిబ్బంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో వంద మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు, ఫ్యాక్టరీ నుంచి 40 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. పేలుడు అనంతరం ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

Next Story

RELATED STORIES