మరో వివాదంలో ట్రంప్

X
TV5 Telugu31 Aug 2019 3:18 PM GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. దేశ రహస్యాలను లీక్ చేస్తున్నారంటూ ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ చేసిన ఓ ట్వీట్, ఈ వివాదానికి కారణమైంది. ఇరాన్ ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విఫలమైందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఐతే, ట్వీట్‌లో ఆయన పోస్ట్ చేసిన ఫోటో హాట్ టాపిక్ గా మారింది. నిఘా వర్గాలు ఇచ్చిన ఫోటోను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఐబీ ఇచ్చిన సమాచారాన్ని అధ్యక్షుడే లీక్ చేయడమేంటని నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇది బాధ్యతారాహిత్యమని దుయ్యబట్టారు. ఈ విమర్శలను ట్రంప్ తోసిపుచ్చారు. ఇరాన్ ప్రయోగానికి సంబంధించిన సమాచా రాన్ని ప్రజలతో పంచుకునే హక్కు తనకు ఉందంటూ వితండ వాదన చేశారు.
Next Story