వివాహేతర సంబంధం.. రోకలితో భార్య తలపై కొట్టి..

వివాహేతర సంబంధం.. రోకలితో భార్య తలపై కొట్టి..
X

వివాహేతర సంబంధాల కారణంగా జీవితాలు బలైపోతున్నాయి. భార్యాభర్తలలో ఏ ఒక్కరు పక్క దారి పట్టినా పలు అనర్ధాలు చోటు చేసుకుంటాయి. విజయవాడలో అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. రామ్‌నగర్‌లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తోన్న సోమేలు, భార్య అశ్వినిని దారుణంగా హత్య చేశాడు.

శుక్రవారం రాత్రి భార్యతో గొడవపడిన సోమేలు.. ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. శనివారం మళ్లీ ఇంటికి తిరిగొచ్చాడు. భార్య తలుపు తీయగానే.. రోకలితో ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దీంతో అశ్విని.. అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. హత్య చేసిన అనంతరం.. పోలీసులకు లొంగిపోయాడు సోమేలు. ఈ హత్యకు అక్రమసంబంధమే కారణంటున్నారు పోలీసులు.

Next Story

RELATED STORIES