విశాఖలో మరో ఘరానా మోసం

విశాఖలో మరో ఘరానా మోసం

విశాఖలో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. ఆన్‌లైన్‌ చీటింగ్‌కు పాల్పడుతున్న అక్రమార్కులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారం ద్వారా లింక్‌ బిజినెస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 7 లక్షల 60 వేల నగదు 2 వందల బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

మెండోలిల్ జువెలరీ లిమిటెడ్‌ కంపెనీ పేరుతో చైన్‌ లింక్‌ బిజినెస్‌ చేసేందుకు ఓ ముఠా 2 రోజుల కిందట విశాఖలో మకాం వేసింది. వీళ్లంతా గుర్గావ్‌కు చెందిన వాళ్లు. ఆన్‌లైన్‌లో తమ కంపెనీలో సభ్యులుగా చేరిన వారందరికీ నగదుతోపాటు బంగారం ఇస్తామని ఆశ చూపారు. కంపెనీలో సభ్యులుగా చేరాలంటే 11 వేల నగదు, 3 వందలు GST కట్టాలన్నారు. ఆ తర్వాత కంపెనీ నుంచి ప్రతి నెల 550 రూపాయల నగదు, బంగారం నాణెం ఇస్తామని ప్రచారం చేశారు.

డబ్బుతోపాటు గోల్డ్‌ కాయిన్‌ కూడా వస్తుండటంతో కొందరు విశాఖ నగరవాసులు ఆసక్తిచూపారు. ఇంట్రెస్ట్‌ ఉన్నవాళ్లను హోటల్ రూమ్‌కి పిలిచారు. అయితే 2 రోజులుగా హోటల్‌కు పదుల సంఖ్యలో గుర్గావ్‌ నుంచి వస్తుండటంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. పోలీసులు రెయిడ్‌ చేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అజయ్‌, మంజునాథ, బద్రి నారాయణరావు, అప్పలనాయుడు సహకరించినట్టు తెలిపారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story