అంతర్జాతీయం

పాకిస్థాన్ ప్రభుత్వానికి విద్యుత్ శాఖ ఊహించని షాక్

పాకిస్థాన్ ప్రభుత్వానికి విద్యుత్ శాఖ ఊహించని షాక్
X

కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం ముందు మనదేశాన్ని ఇరుకున పెట్టడానికి ఇమ్రాన్ ఖాన్ శతవిథాల ప్రయత్నిస్తున్నారు. తాజాగా పాక్ సెక్రటేరియట్ ముందు కశ్మీర్ అవర్ ర్యాలీ నిర్వహించారు. కశ్మీరీలకు తాము అండగా ఉంటామని చెప్పడానికే ఈ ర్యాలీ ఏర్పాటు చేశామని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. ఐతే, ఈ ర్యాలీకి ప్రజల నుంచి స్పందన ఆశించినంతగా రాలేదు. ఐతే, ఇమ్రాన్ మాత్రం రెచ్చిపోయారు. యుద్ధం గురించి మరోసారి ప్రస్తావించారు. అణ్వస్త్రాలు కలిగిన భారత్‌-పాకిస్థాన్‌లు యుద్ధభేరి మోగిస్తే దాని పర్యవసానాలు ప్రపంచం మొత్తం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒకవేళ భారతదేశం, పీఓకేపై సైనిక చర్యకు దిగితే దీటుగా ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు.

పాకిస్థాన్ రైల్వేశాఖ మంత్రి షేక్ రషీద్‌కు కూడా షాక్ తగిలింది. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతుంటగా, షేక్ రషీద్‌కు కరెంట్ షాక్ కొట్టింది. ఆయన చేతిలో ఉన్న మైక్ నుంచి ఒక్కసారిగా కరంట్ ప్రవహించడంతో షేక్ రషీద్ స్వల్పంగా కంపించిపోయారు. సరిగ్గా మోదీ గురించి మాట్లాడుతున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టడంతో షేక్ రషీద్‌ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.

మరోవైపు, పాకిస్థాన్ ప్రభుత్వానికి అక్కడి విద్యుత్ శాఖ ఊహించని షాక్ ఇచ్చింది. విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే కరెంట్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే లక్షలాది రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని కోరింది.

Next Story

RELATED STORIES