ఆంధ్రప్రదేశ్ లో జీతాలు, పింఛన్లు ఆలస్యం.. కారణమేంటంటే..

X
TV5 Telugu31 Aug 2019 2:38 AM GMT
ఏపీలో సెప్టెంబర్ నెల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు ఆలస్యం కానున్నాయి. సెప్టెంబరు 1 ఆదివారం సాధారణ సెలవు దినం కావడం, మరుసటి రోజు (2న) వినాయక చవితి పండగ రోజు కావడంతో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దీంతో వరుసగా రెండురోజులు సెలవుదినాలు రావడంతో సెప్టెంబర్ 3వ తేదీ నుంచి జీతాలు,పింఛన్లు అందుతాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ తెలిపింది. కాగా గతనెల కొన్ని సాంకేతిక కారణాలతో జీతాలు, పింఛన్లు 10 రోజులు ఆలస్యం అయ్యాయి.
Next Story