ఫ్లోరిడా ప్రజలకు దుర్వార్త : ట్రంప్‌ ట్వీట్‌

ఫ్లోరిడా ప్రజలకు దుర్వార్త : ట్రంప్‌ ట్వీట్‌

అమెరికాలోని ఫ్లోరిడాకు ప్రచండ తుపాను ముప్పు పొంచి ఉంది. ఫ్లోరిడా వైపు డోరియన్‌ హరికేన్‌ అత్యంత వేగంగా దూసుకొస్తోంది. 2017లో ఫ్లోరిడాను అతలాకుతలం చేసిన ఇర్మా, 1992లో బీభత్సం సృష్టించిన ఆండ్రూలను మించి ఇది నష్టాన్ని కలిగిస్తుందని ఆందోళన చెందుతున్నారు. అమెరికాను కుదిపేసిన అతిపెద్ద హరికేన్ల స్థాయిలో... డోరియన్‌ ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఫ్లోరిడా ప్రజలకు దుర్వార్త అని అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం ప్యుయోర్టోరికో వద్ద ఉన్న డోరియన్.. అమెరికా కాలమానం ప్రకారం... రేపు అర్ధరాత్రి అట్లాంటిక్‌ తీరంలోని ఫ్లోరిడాను తాకే అవకాశం ఉంది. హరికేన్‌ ముప్పు దృష్ట్యా... పోలెండ్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు ట్రంప్‌. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఫ్లోరిడా తీరంలోని 26 కౌంటీల్లో, జార్జీయాలోని 12 కౌంటీల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. గంటకు 130 మైళ్ల వేగంతో డోరియన్‌ దూసుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

డోరియన్ సమీపిస్తుండడంతో దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ వారం రోజులకు సరిపడా ఆహారం ఉండేలా చూసుకోవాలని పౌరులకు సూచించారు అధికారులు. ఆహారం, నీళ్లు, మందులు తదితర వాటిని వారానికి సరిపడా దగ్గర పెట్టుకోవాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story