నా భర్తకు నాకన్నా అదే ఎక్కువైంది విడాకులు ఇప్పించండి

ఇన్నాళ్ళు భార్యాభర్తలు గొడవల కారణంగా విడాకులు తీసుకున్న సంఘటనలను చూశాం. ఈమధ్య కాలంలో విచిత్రమైన కారణాలతో కపుల్స్ విడిపోతున్నారు. తాజాగా ఓ నూతన జంట విడాకుల విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓ భార్య.. తన భర్త పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ తనను పట్టించుకోవడం మానేశాడని విడాకులు కోరుతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడికి కొద్ది రోజుల కిందటే వివాహం జరిగింది. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన జంటలు హనీమూన్‌ను ఎంజాయి చేస్తుంటాయి. అయితే అతను మాత్రం యూపీఎస్సీ పరీక్షల కోసం సిద్ధమవుతూ .. భార్యను పట్టించుకోవడం మానేశాడు. దీంతో అతని ప్రవర్తనతో విసిగిపోయిన ఆ మహిళ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.
ఆమె అభ్యర్థనను విన్న కోర్టు కౌన్సిలింగ్‌కు వెళ్ళాలని సూచించింది. దీంతో కౌన్సిలింగ్‌కు హజరైన ఆమె తన విడాకులకు గల కారణాన్ని నిపుణులకు వివరించింది. " ఇటీవలే మా వివాహం జరిగింది. నా భర్త పీహెచ్‌డీ పూర్తి చేశాడు. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అతనికి పెళ్ళంటే ఇష్టం లేదు. కానీ తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేకపోవడంతో వారి ఒత్తిడి మేరకు వివాహం చేసుకున్నాడు. వివాహం అయినప్పటి నుంచి నన్ను పట్టించుకోవడం మానేసి చదువుకే అకింతమయ్యాడు. ఆయన ప్రవర్తనతో విసిగిపోయిన నాకు దయచేసి విడాకులు ఇప్పించండి" అంటూ తెలిపింది. తర్వాత అతని వెర్షన్‌ను కూడా నిపుణులు తెలుసుకున్నారు. తనని కాదని ఆమె పుట్టింటికి వెళ్ళిందని.. తనంటే ఇష్టం లేని అమ్మాయితో కలిసి ఉండడం కుదరదని చెప్పాడు. ప్రస్తుతం ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు. దంపతుల మధ్య సయోధ్య కుదర్చడానికి బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విషయంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com